Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచవ్యా ప్తంగా అలరించనున్న సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్ : ప్రభాస్

డీవీ
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (19:37 IST)
salar seaze fire
అధికారదాహం, ఖాన్ సార్ సింహాసనం కోరికకు సోదరభావం పవిత్ర బంధాలు లొంగి పోతాయా? అల్టిమేట్ యాక్షన్ హీరో ప్రభాస్, మనోహరమైన పృథ్వీరాజ్ నటించిన సాలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్  బ్లాక్ బస్టర్ కథతో 2024 ప్రారంభమైంది, ఇది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌ కి వస్తోంది సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్, 2024  ఫిబ్రవరి 16 నుండి హిందీలో ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేయబడు తుంది! ప్రధాన సూత్రధారి ప్రశాంత్ నీల్ రచించి, దర్శకత్వం వహించిన, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ అద్భుత చిత్రం హిందీలో ప్రత్యేకంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో మిమ్మల్ని ఆకర్షించేలా సెట్ చేయబడింది.
 
సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్ లో దేవ అనే టైటిల్ రోల్‌ను పోషించిన ప్రభాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ విజయాన్ని వేడుక చేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం నాకు చాలా థ్రిల్‌గా ఉం ది! ఈ చిత్రాన్ని నిర్మించే ప్రయాణం అద్భుతమైనది. అది మాకు భావోద్వేగభరిత రోలర్ కోస్టర్. ఈ చిత్రం ఇప్పు డు హిందీలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో వస్తోంది. దాని అసమానమైన రీచ్‌తో, ఈ కథను చూసేందుకు ప్రపంచవ్యా ప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించనుంది. ఇక దాని కోసం నేను వేచి ఉండలేను. ఉత్తర,  మధ్య భారతదేశంలోని నా అభిమానులు సలార్ హిందీలో స్ట్రీమింగ్‌లో ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో దూ సుకుపోతున్నారు. వారందరి కోసం, ఇదిగోండి, డిస్నీ+ హాట్‌స్టార్‌లో సినిమా చూడండి!’’ అని అ న్నారు.
సాలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్ లో వర్ధ పాత్రను పోషించిన పృథ్వీరాజ్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ అనేది నేను తిరస్కరించలేకపోయిన స్క్రిప్ట్. అలా ఎందుకు తిరస్కరించలేకపోయాను అనేది డి స్నీ+ హాట్‌స్టార్‌లో హిందీలో సినిమాను చూసినప్పుడు, ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇది అద్భుతమైన తారాగణం, అద్భుతమైన దర్శకత్వం, సినిమాటోగ్రఫీతో పూర్తి చేసిన అద్భుతమైన స్క్రిప్ట్. నేను ఎప్పుడూ ముందుగానే ఏదో ఊహించుకుంటూ ప్రాజెక్ట్‌ లోకి అడుగు పెట్టను; నేను కథతో ప్రేమలో పడ్డాను కాబట్టి చేస్తాను. నేను నా హృదయాన్ని, ఆత్మను సలార్‌: పార్ట్ 1 – సీజ్ ఫైర్ లో ఉంచాను మరియు ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ కథనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసేందుకు ఇక నేను వేచి ఉండలేను!’’ అని అన్నారు.
 
దర్శకుడు, రచయిత  ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, "పవర్ ప్యాక్డ్ యాక్షన్ మరియు ఇంపాక్ట్ ఫుల్ మ్యూజిక్‌తో నిండిన తిరుగుబాటు కథనాలకు నేను ఎప్పుడూ అభిమానిని. అయితే, సలార్‌తో,  హీరో కూడా ఒకరకంగా విలన్ లా ఉండేలా కథను రూపొందించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను.  మీరు వర్ధ  పోరాటాలతో ప్రతిధ్వనించినా లేదా దేవా శక్తితో ప్రతిధ్వనించినా,   చివరిలో, ఇద్దరూ వారి స్వంత యుద్ధాల భారానికి గురవుతారు. అదే నన్ను సాలార్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది - ఇది మీరు కనెక్ట్ అయ్యే కథ. ఇప్పుడు హిందీలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో వస్తున్న చిత్రంతో, దానిని కొత్త ప్రపంచాలకు తీసుకెళ్లడానికి  మరియు కథతో కనెక్ట్ అయ్యే ప్రేక్షకులను కనుగొనడం కోసం మేం ఇక వేచి ఉండలేం. నేను వ్యక్తిగతంగా, దానిని చూడటానికి చాలా సంతోషిస్తున్నాను!" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ డెత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments