Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సలార్' ముందు పఠాన్ - జవాన్ - యానిమల్ రికార్డులు గల్లంతు..

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (14:57 IST)
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం "సలార్". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదల రోజుల సరికొత్త రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ యేడాది ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన 'పఠాన్', 'జవాన్', 'యానిమల్' చిత్రాల ఓపెనింగ్స్‌‍ను బ్రేక్ చేసింది. "సలార్" చిత్రం తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.178.7 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలంగాణాలో ఏకంగా రూ.70 కోట్లు వసూలు చేయగా, కర్నాటక, కేరేళ రాష్ట్రాల్లో రూ.12, రూ.5 కోట్లు చొప్పున వసూలు చేసింది. "పఠాన్" దేశవ్యాప్తంగా తొలి రోజున రూ.57 కోట్లు, "జవాన్" రూ.75 కోట్లు, "యానిమల్" రూ.63 కోట్లు చొప్పున వసూలు చేయగా, ఈ రికార్డులన్నీ "సలార్" తుడిచిపెట్టేసింది. 
 
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన రూ.178 కోట్లలో దేశీయంగా రూ.135 కోట్లు వసూలు కావడం గమనార్హం. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్ నిల్క్ కథనం ప్రకారం దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూ.49 కోట్లు కాగా, శుక్రవారం ఒక్కరోజే రూ.60 కోట్లు దాటాయి. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు "కేజీఎఫ్" డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో చిత్రీకరించారు. భారత్‌లో ఆన్‌లైన్ బుకింగ్స్ రూ.42 కోట్లు దాటాయి. తొలి రోజే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్స్ రూ.180 కోట్లు ఉంటాయని
 
భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్లు వసూలు చేస్తే భారత్ బాక్సాఫీసు వద్ద రూ.135 కోట్లు వసూలవుతాయని చెబుతున్నారు. 2023లో విడుదలైన సినిమాల్లో తొలి రోజే భారీ వసూళ్లతో రికార్డు నెలకొల్పిన సినిమాగా 'సలార్' నిలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments