Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది : శ్రియా రెడ్డి

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (13:51 IST)
ఎంతో మంది అభిమానులు దేవుడితో సమానంగా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని నటి శ్రియా రెడ్డి అన్నారు. తాజాగా వచ్చిన సలార్ చిత్రంలో ఆమె రాధారమ అనే పాత్రలో మెప్పించారు. తన పాత్రను అద్భుతంగా నటించారు. అలాగే, పవన్ కళ్యాణ్ నటించే "ఓజీ" చిత్రంలోనూ నటిస్తున్నారు. సుజిత్ దర్శకుడు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
 
''ఓజీ' అద్భుతమైన చిత్రం. సుజిత్ అదిరిపోయే కథ రాశారు. పవన్‌ కళ్యాణ్‌ను కలిసే వరకూ ఆయన అంత పెద్ద స్టార్‌ అనే విషయం నాకు తెలియదు. ఆయన స్టార్‌డమ్‌ను నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత ఎక్కడికి వెళ్లినా.. "మీరు మా దేవుడితో వర్క్‌ చేస్తున్నారు కదా" అని చాలామంది నన్ను అడిగారు. ఆయనకు విశేష ప్రజాదరణ ఉంది.
 
సెట్‌లో కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన మనసు చాలా మంచిది. పవర్‌స్టార్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఇందులో నాది నెగెటివ్‌ రోల్‌ కాదు. కానీ, నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. అభిమానులతో కలిసి ఫస్ట్‌డే తొలి షో చూసేందుకు ఎదురుచూస్తున్నా' అని ఆమె తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఓజీని నిర్మిస్తున్నారు. ముంబై, జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments