Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల‌లు, వృద్ధుల ఆశీర్వాదాలు పొందిన సాయితేజ్‌

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:43 IST)
saitej with childeren
చిత్ర క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్ అక్టోబ‌ర్ 18వ తేదీ మంగ‌ళ‌వారంనాడు త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. హైద‌రాబాద్ శివార్ల‌లోని ట్రామ్పోలిన్ పార్క్‌లోని అనాథ పిల్లలతో గ‌డిపారు. ఉద‌య‌మే బ‌స్సులో పిల్ల‌ల‌ను పార్క్‌లోకి తీసుకువ‌చ్చారు. ఆయ‌న కారులో అక్క‌డికి చేరుకున్నారు. ఆయ‌న రాక‌తో పిల్ల‌లు, పెద్ద‌లు, మ‌హిళ‌లు ఎంతో ఆనందంగా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.
 
saitej with childeren
సాయితేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పిల్ల‌లు శుభాకాంక్ష‌లు తెలుపుతూ, గాడ్ బ్ల‌స్ యూ అంటూ ఆశీస్సులు అందించారు. అదేవిధంగా వృద్ధులు కూడా ఆయ‌న‌ను ఆశీర్వించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ మ‌హిళ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఎటువంటి అవ‌స‌ర‌మైనా తాను ముందుండి సాయ‌ప‌డ‌తాన‌ని తెలియ‌జేశారు.
 
saitej with childeren
అక్క‌డి పిల్ల‌ల‌తో కాసేపు స‌ర‌దాగా గ‌డిపి వారితో ఆట‌లు ఆడారు. కొంద‌రు చిన్న‌పిల్ల‌లు ఆయ‌న న‌టించిన సినిమాలోని పాట‌ల‌కు అనుగుణంగా నృత్యం చేస్తే చూసి ఆనందించారు. ఈరోజు చాలా ఆనందంగా గ‌డిపిన ఫీలింగ్‌ను వ్య‌క్తం చేశారు. ఆమ‌ధ్య రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో కోమాలో వున్న సాయితేజ్ ఎట్ట‌కేల‌కు కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments