Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ రావణ తరహాలో సాయిరామ్ శంకర్ ఒక పథకం ప్రకారం లుక్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:18 IST)
Sairam Shankar, varma
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. 
 
తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
 
నటీనటులు: 
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతి సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు
 
టెక్నికల్ టీమ్: దర్శకుడు: వినోద్ విజయన్,  నిర్మాతలు: వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్,  నిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్,  సంగీతం: గోపీ సుందర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments