Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' అప్డేట్: ప్రభాస్‌తో తలపడే స్టార్ హీరో ఎవరో తెలుసా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (08:38 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 
 
రాముడితో తలపడే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు. తాజాగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఓం రౌత్ రూపొందించిన 'తానాజీ' చిత్రంలో కూడా సైఫ్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. తాజాగా 'ఆదిపురుష్'లోనూ విలన్ పాత్రను దక్కించుకున్నాడు. 'సైఫ్ అలీఖాన్ సర్‌తో పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గొప్ప నటుడుతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాన'ని ప్రభాస్ పేర్కొన్నాడు. 
 
కాగా, 'ఆదిపురుష్ గురించి రేపు (గురువారం) ఉదయం 7.11 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నామంటూ' బుధవారం చిత్ర కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన సంగతి విదితమే. చెప్పినట్టుగానే ఈ ఉదయం అదే సమయానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో లంకేశ్ (రావణాసురుడు)పాత్రలో విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు ఓ ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం