Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీరీ ఫైల్స్.. జైశ్రీరామ్‌పై సాయిపల్లవి కామెంట్స్

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (11:50 IST)
రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో కొంతమంది ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తుంటే కొంత మంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
 
కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. ఆ సినిమాలో వాళ్ళు ఎలా చంపారు అనే విషయాలను చూపించారు. మనం వాటిని ఒక మత సంఘర్షణల లాగే చూస్తే.. ఇప్పుడు రీసెంట్‌గా బండిలో ఆవులు తీసుకు వెళుతున్నారు. 
 
బండి‌లో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడు అని కొంతమంది కట్టేసి జైశ్రీరామ్ అని అనమంటున్నారు. అలా అయితే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టము. లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు" అని ఆమె చెప్పుకొచ్చింది.
 
అయితే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. కొంత మంది సాయి పల్లవికి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుని మాట్లాడమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే సాయి పల్లవి దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో మేము విరాటపర్వం సినిమా చూడడం లేదని ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments