Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండేల్ సెట్స్ లో సాయి పల్లవి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ ట్విన్ విన్స్ ని సెలబ్రేట్ చేసిన టీమ్

డీవీ
బుధవారం, 17 జులై 2024 (18:09 IST)
Sai Pallavi, Allu arujun
హీరోయిన్ సాయి పల్లవి ఒకేఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులుని అందుకున్నారు. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో విరాట పర్వం, గార్గి చిత్రాలలో తన నటనకు గానూ ఉత్తమ నటి అవార్డ్ విజేతగా నిలిచారు. దీంతో సాయి పల్లవి కెరీర్ లో గెలుచుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డులు సంఖ్య ఆరుకి చేరింది. ఈ సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ "తండేల్" టీం సాయి పల్లివి ని సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తో పాటు చిత్ర యూనిట్ ఆమెను అభినందిస్తూ సెట్స్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.  
 
Tandel team at set
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ "తండేల్".  మ్యాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది.  
 
నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామరస్ అవతార్‌లలో కనిపిస్తారు.
 
దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాంతీయ యాస ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌, నేషనల్ అవార్డ్ విన్నర్  నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం  విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments