Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఫ్యామిలీ మా గురువుగారి వెంటే : సాయి ధరమ్ తేజ్

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (09:22 IST)
పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. గత నెల 28వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. మరోవైపు, ఈ చిత్ర విజయోత్సవ యాత్రలో చిత్ర బృందం నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా, చిత్ర బృందం మంగళవారం శ్రీనగర్‌ కాలనీలోని ఓ హోటల్‌కు వచ్చింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ విలేకర్లతో మాట్లాడుతూ మామయ్య పక్కన నటించడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. 
 
బ్రో చిత్రం కథ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానోనని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. మల్టీస్టార్‌ చిత్రాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. 
 
'స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక లఘు చిత్రం చేశా. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్‌ తీయలేదు. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడండి. నాకు రాజకీయ అనుభవం లేదు. మా కుటుంబ సభ్యులంతా పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటాం' అని స్పష్టం చేశారు.
 
'బ్రో' చిత్రంలో నా క్యారెక్టర్‌ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్‌ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్‌ కల్యాణ్‌తోనే జీవితాంతం ఉంటాం'అని చెప్పారు.
 
ఆ తర్వాత చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ, నటించడం కంటే దర్శకుడిగా రాణించడమే చాలా ఇష్టమన్నారు. గత 16 ఏళ్లుగా దర్శకత్వం చేస్తున్నానని, పవన్‌తో అందరూ సినిమాలు తీయాలనుకుంటున్నా వారికి సాధ్యపడలేదన్నారు. కానీ, తన టైం వచ్చిందని, అందుకే అలాంటి స్టార్‌ను డైరెక్ట్ చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. 
 
పవన్‌ కల్యాణ్‌తో 10 నిమిషాలు మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు. ఈ చిత్రం తీసేందుకు సాయి ధరమ్‌తేజ్‌ ఆరోగ్యం కోలుకొని త్వరగా రావాలని రెండేళ్లు ఎదురు చూశానని సముద్రఖని వెల్లడించారు. ఆ నిరీక్షణకు ఫలితం దక్కిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments