Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ హీరోనా మజాకా... ఒక్క పూటకు రూ.20 లక్షలు సంపాదించిన సాయిధరమ్ తేజ్

వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించటమే కాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆపన్నహస్తాలుగా మారారు మన టాలీవుడ్‌ స్టార్స్‌. లక్ష్మీమంచు నిర్వహిస్తున్న 'మేముసైతం' కార్యక్రమం కోసం.. టాలీవుడ్ స్ట

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:12 IST)
వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించటమే కాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆపన్నహస్తాలుగా మారారు మన టాలీవుడ్‌ స్టార్స్‌. లక్ష్మీమంచు నిర్వహిస్తున్న 'మేముసైతం' కార్యక్రమం కోసం.. టాలీవుడ్ స్టార్స్ కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తమ స్టార్ ఇమేజ్‌ని పక్కనపెట్టేసి సాధారణ వ్యక్తుల్లా మార్కెట్‌లలో పనులు కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. 
 
ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను కష్టాల్లో ఉన్నవారిని ముందుగానే ఎంపిక చేసి ఇస్తుంటారు. అనేక మంది సినిమా సెలెబ్రెటీలు 'మేముసైతం'లో పాల్గొని డొనేషన్స్ వసూలు చేయగా ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ కార్యక్రమంలో భాగమయ్యాడు. అయితే వారు ఎవ్వరు సాధించని రికార్డు ఇప్పడు సాయి ధరమ్ సాధించాడు. ఈ షో కోసం మెగా హీరో రోడ్డుపైన స్వీట్లు అమ్మే కుర్రాడి అవతారం ఎత్తి చాల డబ్బులు ఈ షో కోసం అందించాడు. 
 
తూర్పు గోదావరి జిల్లా పులిమెర్రులోని అంగ వికలాంగుల పిల్లల కోసం నడుపుతున్న స్కూల్‌కి విరాళం ఇచ్చేందుకు తేజు ఏకంగా 20 లక్షలు ఒక్క పూటలో సంపాదించడం నిజంగా విశేషం. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎపిసోడ్స్‌లలో ఇంత పెద్ద మొత్తాన్ని అందించడం అతి పెద్ద రికార్డ్ అని మంచు లక్ష్మి చెప్పారు.

ఇలాంటి బుల్లితెర షోలలో ఇప్పటివరకు మెగా యంగ్ హీరోలు పాల్గొనడం లేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఇటువంటి షోలలో మెగా హీరోలు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో తేజ్ రంగప్రవేశం తర్వాత స్పష్టంగా కనిపించింది అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మెగాహీరో అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments