Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం "సుబ్రమణ్యం ఫర్ సేల్" మూవీ కథ ఇదేనా...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (10:47 IST)
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం "సుబ్రమణ్యం ఫర్ సేల్". ఈ చిత్రం కథ లీకైనట్టు మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రం కథ లీక్‌పై అనేక రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 
ఇక కథ విషయానికి వస్తే.. ఇందులో రెండు సినిమాలు కలిసి నడిచే కథ. ఇందులో ఒకటి చిరంజీవి లోగడ నటించిన హిట్ చిత్రం ‘బావగారూ బాగున్నారా’. రెండోది... జూనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ ‘బృందావనం’. ఈ రెండు చిత్రాల కథలను నేపథ్యంగా తీసుకుని తీశారట. ఇందులో సారాంశ ఏమిటంటే హీరో (సాయిధరమ్ తేజ్) డబ్బు కోసం ఏ పనైనా చేసే రకం ఎంతటి సాహసానికైనే తెగించే నైజం. అయితే ప్రేయసి (రెజీనా) కోసం తనకు ఇచ్చిన మాట కోసం ఒక ఊరికి వెళతాడు.. అక్కడ మరో హీరోయిన్ (అదాశర్మ)తో పరిచయమేర్పడుతుంది. 
 
ఆ ఊరిలో మన హీరో చేసే ఘనకార్యాలు.. ఆదే ఊరికి వచ్చిన మొదటి హీరోయిన్ (రెజీనా) మరో హీరోయిన్ (అధా శర్మ)ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలతో సినిమా స్టోరీ నడుస్తుందట.. వాస్తవానికి ఈ మధ్య సినిమాలు రాక ముందే స్టోరీలైన్ లీక్ కావడం కామన్ అయ్యింది. 
 
కాగా, ఈ  చిత్రంలో సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీన్‌ ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌.ఎస్‌. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments