Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్చమైన తెలుగింటి టైటిల్ సఃకుటుంబానాం ఫస్ట్ లుక్

డీవీ
గురువారం, 11 ఏప్రియల్ 2024 (15:33 IST)
Sahkutumbanam first look
మహాదేవ గౌడ్ నూతనంగా నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’ హెచ్ ఎన్ జి సినిమాస్ బ్యానర్ లో మొదలైంది. ఉదయ్ శర్మ రాచనా, దర్శకత్వం చేయగా, రామ్ కిరణ్ హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు, హీరోయిన్ గా మేఘ ఆకాష్ చేస్తున్నారు. చిత్ర యూనిట్  ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 
 
నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ: ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అచ్చమైన తెలుగింటి టైటిల్ అని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు.  రేషన్ కార్డు డిజైన్ లా ఉన్న పోస్టర్ బట్టి సినిమాకూడా మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుంది అనేలా ఉంది. ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్ రావడం చాలా సంతోషం. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్, శుభలేఖ సుధాకర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ, రమేష్ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మ్యుజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సఃకుటుంబానాంకు మ్యుజిక్ అందిస్తున్నారు.  సినిమాటోగ్రఫీ మధు దాసరి, శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 
 
డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ: రేషన్ కార్డు లాగా ఉన్న ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ గారు చాలా పెద్ద అసెట్. కంటెంట్ ని నమ్మి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. రీసెంట్ గా ఇంత మంది ఆర్టిస్టులు ఇంత మంచి  కాంబినేషన్స్ తో ఏ సినిమా రాలేదు, కంటెంట్ ఉంటె తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అని నిరూపిస్తారు. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది, ఎంతో మంది సీనియర్స్ ఇందులో నటించారు, వాళ్ళ నటన గురించి ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేదు. మీరు ఊహించని కంటెంట్ ని మేము చూపిస్తాము. నిర్మాత మహాదేవ గౌడ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా  ఒక షెడ్యూల్ ఉంది అనగానే వెంటనే సపోర్ట్ చేసేవారు, చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఈ సినిమాని, ఈ బ్యానర్ ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. 
 
తారాగణం:  రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, బద్రం .. తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments