Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SaahoreBaahubali సాంగ్ రిలీజ్.. బాహుబలి 2పై సెన్సార్ ప్రశంసలు.. (Video)

రాజమౌళి బాహుబలి సీక్వెల్‌ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాహుబలికి సెన్సార్ సభ్యులే ట్వీట్ ద్వారా కితాబిచ్చారు. పనిలో పనిగా సాహోరే బాహుబలి వ

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (17:13 IST)
రాజమౌళి బాహుబలి సీక్వెల్‌ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాహుబలికి సెన్సార్ సభ్యులే ట్వీట్ ద్వారా కితాబిచ్చారు. పనిలో పనిగా సాహోరే బాహుబలి వీడియో నెట్లో రిలీజ్ అయ్యింది ఈ పాటలో ప్రభాస్ అద్భుతంగా కనిపించాడు. కంటికి కనువిందుగా ఈ పాట సాగింది. 
 
ఇదిలా ఉంటే.. బాహుబలి మొదటి భాగంతో పోలిస్తే, రెండో భాగం నూటికి నూరు శాతం అద్భుతమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ తన సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా ఫలితంపై మంచి స్పందన వస్తోందని, టాలీవుడ్‌కు, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడిందని చెప్పారు. 
 
మరోవైపు కట్టప్ప కన్నడిగులకు సారీ చెప్పారు. దీంతో కన్నడలో బాహుబలికి రూట్ క్లియర్ అయ్యింది. అయితే ఈ గొడవలు తమిళనాడుకు పాకాయి. తాజాగా విడుదలైన కన్నడ చిత్రాలను ప్రదర్శిస్తున్న పలు థియేటర్ల వద్దకు వచ్చిన తంబీలు, బలవంతంగా చిత్ర ప్రదర్శనను ఆపివేశారు. ఈ గొడవ పెను వివాదమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments