Webdunia - Bharat's app for daily news and videos

Install App

RX100 కాదు... ఆర్డీఎక్స్ 100, టాలీవుడ్ బాక్సాఫీస్ షేకింగ్, డైరెక్ట‌ర్‌కు వరుస ఆఫర్లు

చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకున్న చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తికి ఇండ‌స్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. బ‌డా నిర్మాత‌లు అతనితో సినిమా చేసేందుకు క్యూ క‌డుతున్నారు. రూ. 2.70

Webdunia
సోమవారం, 16 జులై 2018 (15:04 IST)
చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకున్న చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తికి ఇండ‌స్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. బ‌డా నిర్మాత‌లు అతనితో సినిమా చేసేందుకు క్యూ క‌డుతున్నారు. రూ. 2.70 కోట్ల‌కు అమ్మిన ఆర్ఎక్స్ 100 చిత్రానికి రూ.5.18 కోట్ల షేర్ వ‌చ్చింది. అయినా క‌లెక్ష‌న్స్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఆల్రెడీ ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ప్ర‌కారం బ్లాక్ బ‌ష్ట‌ర్ విజయాన్ని సాధించింది.
 
ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ చిత్రం డైరెక్ట‌ర్ బాల‌య్య నిర్మాత‌కు సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇంత‌కీ బాల‌య్య నిర్మాత ఎవ‌రంటారా..?  బాల‌య్య‌తో పైసా వ‌సూల్ సినిమాని నిర్మించిన భ‌వ్య క్రియేష‌న్స్ అధినేత ఆనంద్ ప్ర‌సాద్. ఈ బ్యాన‌ర్లో సినిమా చేసేందుకు అజయ్ భూప‌తి ఓకే చెప్పాడ‌ట‌. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా సినిమాని ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. నిర్మాత‌లు స్ర‌వంతి ర‌వికిషోర్, నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్ రెడ్డి కూడా అజ‌య్‍తో సినిమా చేసేందుకు ఇంట్ర‌ెస్ట్ చూపిస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments