ఇర‌వై మిలియన్స్ కు చేరిన ఆర్ఆర్ఆర్‌- దోస్తీ పాట

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (13:32 IST)
Dosth song
ఆగ‌స్టు 1న ఫ్రెండ్ షిప్‌డేనాడు రాజ‌మౌళి విడుద‌లచేసిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌.`లోని దోస్త్ సాంగ్‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ పాట ఏకంగా 20  మిలియ‌న్ల‌కు చేరుకుంది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సాంగ్ లో సంగీత దర్శకులు అమిత్ త్రివేది, ఎంఎం కీరవాణి, అనిరుధ్, విజయ్ ఉన్నారు. ఈ వీడియోలో ఎన్టీఆర్,  రామ్ చరణ్ కూడా కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ మనోహరమైన పాటను ఎంఎం కీరవాణి స్వరపరిచారు.
 
ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌ల్పిత‌క‌థ‌తో రూపొదుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రను ఎన్‌.టి.ఆర్‌. పోషిస్తుండగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామ రామరాజు పాత్రను పోషిస్తున్నారు. ఇంకా అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్,రామ్ చరణ్ జంటగా, ఒలివియా మోరిస్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను ముందుగానే అనుకున్న‌ట్లు అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

కారును ఢీకొన్న విమానం... వీడియో వైరల్

రేవంత్ రెడ్డి విజన్ విన్నాక విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయా : ఆనంద్ మహీంద్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments