Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న "ఆర్ఆర్ఆర్" - 3 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్స్

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (15:19 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". డీవీవీ దానయ్య నిర్మాత, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రను పోషించారు. అలియా భట్ హీరోయిన్. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.223 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. 
 
గత మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో పాత రికార్డులన్నీ బద్ధలైపోతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఈ టాక్‌తో సంబంధం లేకుండా కనకవర్షం కురిపిస్తుంది. థియేటర్లకు ప్రేక్షకులు తండోపతండాలుగా తరలివస్తుండటంతో ప్రతి షో హౌస్ ఫుల్ కలెక్షన్లలో నడుస్తుంది. ముఖ్యంగా, ప్రాంతీయ హద్దులను ఈ చిత్రం చెరిపేసింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాలం, హిందీ ఇలా అన్ని భాషల్లోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. 
 
శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఏకంగా రూ.500 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఈ వివరాలను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. సోమవారం కూడా ఈ చిత్రం ఇదే ఊపుతో ప్రదర్శితమవుతుంది. భారతీయ సినిమాకు "ఆర్ఆర్ఆర్" మరింత ఖ్యాతిని తీసుకొచ్చిందని కొనియాడారు. కరోనా సమయంలో సెలవులు కూడా లేని రోజుల్లో విడుదలైనప్పటికీ ఆర్ఆర్ఆర్ తిరుగులోని విధంగా దూసుకునిపోతుందని ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments