Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు సారీ చెపితే రోజా కాళ్లుపట్టుకుని క్షమాపణ కోరతా : బండ్ల గణేష్

తమ దేవుడు, స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా క్షమాపణ చెపితే అపుడు తాను కాళ్ళుపట్టుకుని సారీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు నిర్మాత బండ్ల గేణేష్ స్పష్టం చేశారు

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (17:15 IST)
తమ దేవుడు, స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా క్షమాపణ చెపితే అపుడు తాను కాళ్ళుపట్టుకుని సారీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు నిర్మాత బండ్ల గేణేష్ స్పష్టం చేశారు. 
 
ఇటీవల తెలుగు టీవీ చానెల్ ఒకటి వారసత్వ రాజకీయాలపై ఓ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో బండ్ల గణేష్‌తో పాటు రోజా కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వారి మధ్య మాటల యుద్ధం శృతిమించిపోయింది. వీరిద్దరూ ఒకరిని మించి ఒకరు ఎక్కడా తగ్గకుండా దూషించుకున్నారు.
 
అయితే అదే చానెల్ మరోసారి బండ్ల గణేష్‌ని ఈ విషయంపై వివరణ కోరుతూ ఒక ప్రజా నాయకురాలిని అలా అనడంపై మీరు రోజాగారికి క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది.  దీనిపై ఆయన మాట్లాడుతూ.. 'నేనెందుకు క్షమాపణ చెప్పాలి. అందులో నా తప్పేం లేదు. ముందు ఆవిడే మాట జారారు. ఆ తర్వాత నేను అలా అనాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్‌గారిని వాడు వీడు అంటావేంటమ్మా.. అలా అనవద్దు అని నేనంటే.. ఆవిడ ఏదేదో మాట్లాడేశారు. రోజాగారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంతగా మాట్లాడేశారు. 
 
రోజాగారిని పవన్ కల్యాణ్‌‌గారికి క్షమాపణ చెప్పమనండి. అప్పుడు నేను ఆవిడ కాళ్లు పట్టుకుని మరీ క్షమాపణ చెబుతా. లేదంటే నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు ఏం చేయలేదు. అక్కడికీ నేను చాలా గౌరవంగా ఆమెను.. అమ్మా.. రోజాగారు.. అంటూనే సంభోదించా. ఆవిడ ఆవేశంతో మాట జారారు. ఆ తర్వాతే నేను కూడా ఆవేశంతో మాట జారాల్సి వచ్చింది. అంతే..' అంటూ బండ్ల గణేష్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments