'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

ఠాగూర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (17:41 IST)
కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార-2' మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.717 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాదించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించారు. దీంతో 'కాంతార చాప్టర్-1' సరికొత్త మైలురాయిని చేరుకుంది. 
 
హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ చిత్రం ఈ చిత్రాన్ని నిర్మించింది. గత రెండు వారాల్లో రూ.717 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.105 కోట్లకుపైగా రాబట్టినట్టు సినీ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో 'కాంతార-1' ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉంది. గతంలో విడుదలైన "కేజీఎఫ్" చిత్రం రూ.1200 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో వుంది. 
 
కాగా, 'కాంతార-1' చిత్రం సెప్టెంబరు 2వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. రిలీజ్ రోజే అత్యధికంగా రూ.89 కోట్లు వసూలు చేసిన కన్నడ చిత్రంగా నిలిచింది. 24 గంటల్లో బుక్ మై షోలో 1.28 మిలియన్లకి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్ వేదికగా ఈ యేడాదిలో ఈ రేంజ్‌లో టిక్కెట్లు అమ్ముడు పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments