Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌లో హిట్టైపోయిన ప్రియాంక చోప్రా: క్వాంటికోలో అదరగొట్టేసిందట!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (12:43 IST)
చెర్రీ జంజీర్ భామ ప్రియాంక చోప్రాకు హాలీవుడ్‌లో ఓ గుర్తింపు వచ్చేసింది. చెర్రీ సరసన నటించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో సందడి చేస్తోంది. తాజాగా ప్రియాంక నటించిన హాలీవుడ్ టీవీ సీరియల్ క్వాంటికో తొలి భాగం టెలికాస్ట్ అయింది.

ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసం అమెరికా దేశమంతా చుట్టేస్తోందీ బ్యూటీ. ఈ సీరియల్‌లో ప్రియాంక చోప్రానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మొత్తం టీవీ షోలో ప్రియాంక మాత్రం ఇరగదీసిందని టాక్ వస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా కేరెక్టర్ పేరు అలెక్స్ పారిష్. ఈమె ఎఫ్‌బీఐలో పని చేస్తుందన్నమాట.
 
పాత్ర ప్రకారం ఈమె హాఫ్ ఇండియన్ హాఫ్ అమెరికన్. వాస్తవానికి ఈ సీరియల్ ప్రచారానికి ముందునుంచే ప్రియాంక సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయింది. ఇంటిమేట్ సీన్స్ నుంచి - ఎమోషనల్ సీన్స్ వరకు ఛేజింగ్ నుంచి కార్‌లోనే రొమాన్స్ జరిపే సన్నివేశాల వరకూ అన్నింటిలోనూ ప్రియాంక చోప్రానే మెయిన్ ఫోకస్ చేశారు. 
 
తన పాత్రకు రెస్పాన్స్ అదిరిపోవడంతో ప్రియాంక చోప్రా అదరగొట్టేసింది. దీనికి తోడు సోదరి పరిణీతి చోప్రా, సహ హీరోయిన్స్ దీపికా, అలియా భట్, సోనాక్షి, అనుష్క శర్మలు ప్రియాంకకు అభినందలు తెలపడంతో ప్రియాంక చోప్రా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments