Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ హత్య కేసు : రియా చక్రవర్తిపై చార్జిషీటు దాఖలు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (07:56 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిపై ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు చార్జిషీటును దాఖలు చేశారు. 
 
ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు డ్రగ్స్ తీసుకున్నందుకు అలాగే దివంగత స్టార్ రాజ్‌పుత్ తరపున వాటిని పొంది చెల్లించినందుకు అభియోగాలు నమోదు చేయాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో రియా, ఆమె సోదరుడు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, రియా చక్రవర్తి సెప్టెంబర్ 2020లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రియాను పోలీసులు అరెస్టు చేయగా, దాదాపు నెల తర్వాత జైలు జీవితం తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొంత మంది వ్యక్తులపై కూడా డ్రగ్స్ ఫైనాన్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం వీరిలో చాలామంది బెయిల్‌పై స్వేచ్ఛగా ఉన్నారు. కాగా, గత 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహం ముంబైలోని బాంద్రాలోని అతని అపార్ట్‌మెంట్‌లో గుర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments