Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ హ్యావ్ అన్ క్లిప్డ్ మై వింగ్స్... నీ భేషరతు ప్రేమకు బానిసను... రియా

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:45 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులోని మిస్టరీని సీబీఐ ఛేదించనుంది. సుశాంత్ ఆత్మహత్యకు సినీ ఇండస్ట్రీలోని బంధుప్రీతి (నెపోటిజం) ప్రధాన కారణంకాగా, బాలీవుడ్ మీడియా మాఫియా హస్తం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ కేసులో అందరి వేళ్లూ సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపైనే చూపిస్తున్నాయి. సుశాంత్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆమె బాలీవుడ్ స్టార్ నిర్మాత మహేశ్ భట్‌కు దగ్గరయ్యారు. 
 
ఆయన సలహా మేరకే సుశాంత్‌తో బ్రేకప్ చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు రియా - మహేశ్ భట్‌ల మధ్య జరిగిన వాట్సాప్ సందేశం ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైగా, ఇదే అంశంపై ఓ జాతీయ టీవీ చానెల్ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేయగా, ఇది ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ నమ్మశక్యం కాని చాటింగ్ అంటూ ఆ కథనం పేర్కొనడం గమనార్హం. 
 
తనకు సుశాంత్‌తో బ్రేకప్ జరిగిపోయిందని, నీ వల్ల నాకు స్వేచ్ఛ వచ్చింది. 'యూ హ్యావ్ అన్ క్లిప్డ్ మై వింగ్స్' అంటూ మహేశ్ భట్‌కు రియా చాట్ మెసేజ్ పంపగా, ఇక వెనక్కు తిరిగి చూడవద్దు (డోంట్ లుక్ బ్యాక్) అని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకో చాటింగ్‌లో 'నీ బేషరతు ప్రేమ నాలో ఉన్న అన్ని అనుమానాలనూ తొలగించింది. నా హృదయ లోతుల్లోకి వెళ్లింది' అని రియా వ్యాఖ్యానించినట్టు వార్తా సంస్థ పేర్కొంది. వీరిద్దరి ఈ సంభాషణ జూన్ 8వ తేదీన జరిగినట్టు పేర్కొంది. ఈ కథనం ఇపుడు సంచలనం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments