సీఎం కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసిరిన దర్శకుడు ఎవరు?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:08 IST)
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమతమ గృహాలకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో పలువురు సెలెబ్రిటీలు తమ ఇళ్లలో పను చేస్తూ, అలాంటి పనులనే చేయాలంటూ మరికొంతమంది సెలెబ్రిటీలను నామినేట్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. 
 
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు సందీప్ వంగా బీ ద రియల్ మ్యాన్ పేరుతో విసిరిన ఓ ఛాలెంజ్ ఇపుడు టాలీవుడ్‌లో వైరల్ అయింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమ టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. 
 
ముఖ్యంగా రాజమౌళి తన పనులను పూర్తి చేసి, జూనియర్ ఎన్టీఆర్, చెర్రీల పేర్లను నామినేట్ చేశారు. ఇపుడు ఈ ఇద్దరు హీరోలు మరికొందమంది పేర్లను నామినేట్ చేశారు. ఈ క్రమంలో తెలుగులో వివాదాస్పద దర్శకుడుగా పేరొందిన రాంగోపాల్ వర్మ ఇపుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసిరారు. 
 
ఇప్పుడు అంద‌రూ మందు దొర‌క్క ఇబ్బందిప‌డుతున్నారని, ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీవీలో అంద‌రికీ క‌నిపించేలా గ్లాస్ విస్కీ తాగి అందరికీ షాక్ ఇవ్వాల‌నేదే త‌న ఛాలెంజ్ అని ఆర్జీవీ తెలిపారు.
 
అయితే, ఆర్జీవీ ఈ తరహా ఛాలెంజ్ విసరడానికి గల కారణాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయివున్నాయి. ఇపుడు విస్కీ ఛాలెంజ్ విసరడం ద్వారా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీవీలో అంద‌రికీ క‌నిపించేలా గ్లాస్ విస్కీ తాగి అందరికీ షాక్ ఇవ్వాల‌నేదే త‌న ఛాలెంజ్ అని ఆర్జీవీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments