Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగా.. బీబీ-ఏబీ అని పిలుస్తారు: రాజమౌళిపై వర్మ కితాబు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బాహుబలి2 సినిమాకు వర్మ కొత్త నిర్వచనం ఇచ్చాడు. ప్రపంచకాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగానే.. ఇప్పుడు భారతీయ సిని

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (15:13 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బాహుబలి2 సినిమాకు వర్మ కొత్త నిర్వచనం ఇచ్చాడు. ప్రపంచకాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగానే.. ఇప్పుడు భారతీయ సినిమాలను బాహుబలికి ముందు(బీబీ), బాహుబలికి తర్వాత(ఏబీ) అని పిలుస్తారంటూ ట్వీట్‌ చేశాడు. ఖాన్లు, రోషన్లు, చోప్రాల కన్నా రాజమౌళి గొప్పవాడని వర్మ రాసుకొచ్చాడు. 
 
వజ్రం లాంటి రాజమౌళిని గుర్తించిన కరణ్‌జోహార్‌కు పాదాభివందనం చేయాలని, ఈ విషయంలో జోహార్‌తో సెల్యూట్‌ చేస్తున్నానంటూ రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. బాహుబలి చిత్రాన్ని చూసిన బాలీవుడ్‌లోని ప్రతి సూపర్‌స్టార్‌, ప్రతి అత్యుత్తమ దర్శకుడూ వణికిపోతున్నాడని వర్మ రాసుకొచ్చాడు. 
 
ఇకపోతే.. బాహుబలి2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అనూహ్య రీతిలో భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలతో పాటు ఉత్తరాదిన కలెక్షన్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments