Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మా' పై వర్మ వ్యంగ్యాస్త్రాలు - 'మా' వివాదంలో మరో ట్విస్ట్

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (12:49 IST)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మొదలు.. ఫలితాలొచ్చేదాకా సాగితన హైడ్రామా అంతాఇంతా కాదు. ఇటు హీరో మంచు విష్ణు వర్గం, నటుడు ప్రకాష్ రాజ్ వర్గం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఇక, ఎన్నికలయ్యాక ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ.. తమ పదవులకు ఏకంగా రాజీనామానే చేశారు.
 
అయితే, తాజాగా ‘మా’ ఎన్నికలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మా’ను సర్కస్‌తో పోలుస్తూ ఓ ట్వీట్ వదిలారు. 'మేమంతా ఓ సర్కస్ అని ప్రేక్షకులకు సినీ‘మా’ జనం మరోసారి నిరూపించారు' అని ట్వీట్ చేశారు. 
 
దీనిపై నెటిజన్లు చర్చకు తెరదీశారు. ఎవరిగురించి అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమేనని కొందరు రిప్లై ఇస్తుంటే.. మెగా ఫ్యామిలీ గురించేనంటూ కొందరు, లేదూ నరేశ్ గురించి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
 
ఇదిలావుంటే, మా వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మా ఎన్నికల సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సీల్ చేశారు. అంతేకాకుండా, మా ఎన్నికలు జరిగిన బంజారా హిల్స్ పబ్లిక్ స్కూల్ సర్వర్ రూమ్‌కు పోలీసులు తాళం వేశారు. 
 
పోలింగ్ రోజున మోహన్ బాబు వర్గం తమపై దాడి చేసిందనీ, అందువల్ల ఈ సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ కోరగా, ఆ ఫుటేజీలు ఇవ్వలేమంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ చెప్పినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఈ సర్వర్ రూమ్‌కు పోలీసులు తాళం వేయడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments