భీమ్లా నాయక్ వేడుక సంద‌ర్భంగా ఆంక్ష‌లు - అంబులెన్స్‌కు అనుమ‌తి

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:40 IST)
Police g round
భీమ్లా నాయక్  ప్రీ రిలీజ్ సందర్భంగా ఈరోజు మద్యహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన‌ట్లు ఎస్.పి. కార్యాల‌యంలో తెలియ‌జేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా న‌టించిన ఈ సినిమాకు కె.సి.ఆర్‌. త‌న‌యుడు ఐ.టి. మంత్రి కె.టి.ఆర్‌. రావ‌డంతో ఈ ఆంక్ష‌లు విధిస్తున్నారు. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ నుంచి యూసుఫ్‌గూడా, ఫిలింన‌గ‌ర్‌, కృష్ణ‌న‌గ‌ర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్‌ కు వెళ్ళానుకున్న‌వారికి మ‌రోవైపు మార్గం నిర్దేశించారు. దీనితో ఆ చుట్టుప‌క్క‌ల సామాన్యులు కాస్త ఇబ్బంది ప‌డినా త‌ప్ప‌ద‌ని ప‌హారా కాస్తున్న పోలీసులు తెలియ‌జేస్తున్నారు. అత్య‌వ‌స‌రంగా అంబులెన్స్ సేవ‌లు మాత్రం అనుమ‌తిస్తున్నారు.
 
యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. స‌మీపంలోనే పోలీసు క్వార్ట‌ర్లు వున్నాయి. అక్క‌డే యూసుఫ్‌గూడ బ‌స్టాఫ్ కూడా వుంది. అక్క‌డ‌నుంచి వివిధ ప్రాంతాల‌నుంచి చేరుకుని హైటెక్ సిటీకి వెళ్ళేందుకు ర‌ద్దీగా వుంటుంది. ఇప్పుడు వారంతా సార‌ధి స్టూడియోవైపు వెళ్లి అక్క‌డ బ‌స్‌లు ఎక్కాల్సి వుంటుంది.
 
మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపు వాహనాలకు అనుమతి నిరాకరణ. యూసుఫ్ గూడా బ‌స్తీలో గ‌ల సవేరా ఫంక్షన్ హాల్-క్రిష్ణ కాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమగమం-కృష్టానగర్ మీదుగా మళ్ళింపు.
జూబ్లిహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్ళింపు
- సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ప్రదేశాలు
 
కాగా, ఇప్ప‌టికే  21వ తేదితో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని వెల్లడిచేసింది నిర్మాణ సంస్థ‌. అందుకే కొత్త‌గా ఈరోజు మీడియా పాస్‌ల‌ను, అభిమానుల పాస్‌ల‌ను 11గంట‌ల‌కు వ‌చ్చి కార్యాల‌యంలో తీసుకోవాల‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments