Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు అందమైన భార్య... చక్కని కుమార్తె ఉంది.. ప్లీజ్ అర్థం చేసుకోండి : రేణూ దేశాయి

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ మరోమారు స్పందించారు. పవన్‌తో కలిసి జీవించాలని ఫ్యాన్స్ పదేపదే కోరుతుండటంపై ఆమె ఫేస్‌బుక్ వేదికగా ఓ విన్నపం చేశారు.

Webdunia
శనివారం, 1 జులై 2017 (06:37 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ మరోమారు స్పందించారు. పవన్‌తో కలిసి జీవించాలని ఫ్యాన్స్ పదేపదే కోరుతుండటంపై ఆమె ఫేస్‌బుక్ వేదికగా ఓ విన్నపం చేశారు. 
 
"నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ ఓ విజ్ఞప్తి చెయ్యాలనుకుంటున్నా. కల్యాణ్‌గారు నాలుగేళ్ల క్రితం అన్నా లెజ్‌నెవాను వివాహం చేసుకున్నారు. వారికి చక్కని కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. 
 
నేను కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరవద్దు. పవన్‌కల్యాణ్‌గారి భార్య అన్నా లెజ్‌నెవా.. నేను కాదు. ఆయన నా బిడ్డలకు తండ్రి మాత్రమే. మేమిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులం. అభిమానులు దయచేసి అర్థం చేసుకోండి. మేమిద్దరం ఎప్పటికీ తిరిగి భార్యభర్తలు కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. తిరిగి కల్యాణ్‌గారి దగ్గరికి వెళ్లమని మాటిమాటికీ కోరడం సబబుకాదు. 
 
మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని అందరికీ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులూ కలిగించే, ఒత్తిడితో కూడిన కోరికలేమీ మీ దగ్గర నుంచి ఎదురుకావని ఆశిస్తున్నా. ఎంతో నిజాయితీతో మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అని రేణూ దేశాయ్ ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments