జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్లీ సీన్లోకి వచ్చింది. రేణూ దేశాయ్ ప్రస్తుతం రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానంగా తెరకెక్కించిన మిట్టీ సినిమా ట్రైలర్ చూడాలని కోరింది.
ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు ద్వారా ఈ వీడియోను చూడాల్సిందిగా కోరింది. '' రైతులే మనకు జీవనాధారం. దేశంలో రైతుల మేలుకోరే కొందరు నిర్మించిన మిట్టి సినిమా ట్రైలర్ లింక్‌ను షేర్ చేసుకుంటున్నాను. దీన్ని చూడండి..'' అంటూ కోరింది.
దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు ఈ ట్రైలర్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. పంటలు పండక, తీసుకున్న అప్పులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడే రైతుల కుటుంబాల ఆవేదన ఇందులో కనిపించింది. కుటుంబాలు, ఒక సీజన్ లో మంచి ధర వచ్చిందని, అప్పు చేసి డబ్బు తెచ్చి, పత్తి పంటను వేసి, వర్షాలు కురవక పంట నష్టపోతున్న రైతన్నల వ్యధలను ఈ ట్రయిలర్ లో ప్రస్తావించారు.