Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ డబ్బు మనిషి కాదు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి : రేణు దేశాయ్

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (17:17 IST)
తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మంచి సర్టిఫికేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయనకు డబ్బు పిచ్చి లేదని స్పష్టంచేశారు. సమాజానికి, ప్రజలకు మంచి చేయాలన్న తపనే ఆయనను రాజకీయాల వైపు మళ్లించిందని, అందువల్ల ఆయనుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమె ఏపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి రాజకీయాల్లోకి తమ పిల్లలను లాగొద్దని కోరారు. అలాగే, వ్యక్తికత జీవితం, మూడు పెళ్లిళ్ల అంశాన్ని కూడా పక్కన బెట్టాలని ఆమె సూచించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోను  షేర్ చేశారు.

 
"తొలి రోజు నుంచి ఇప్పటివరకు పవన్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తునే ఉన్నా.. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా.. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకూ ఆయన అరుదైనవ్యక్తి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్లు సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు. ఆయనను పొలిటికల్‌గా ఎపుడూ సపోర్ట్ చేస్తుంటాను. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక సక్సెస్‌పుల్ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు. మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే అని చెప్పారు. 
 
అలాగే, "బ్రో" సినిమాలోని శ్యాంబాబు పాత్రపై ఆమె స్పందిస్తూ ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారితీశాయని తెలిపింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే పవన్‌పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని ఇటీవల కొందరు అన్నారు. ఆయన పెళ్లిళ్ళు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. నా పిల్లలనే కాదు. ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగకండి. రాజకీయంగా ఏదానా ఉంటే మీరూమీరూ చూసుకోండి:" అని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments