Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా : రేణూ దేశాయ్

హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఓ సందర్భం గురించి ప్రస్తావిస్తూ తోడుంటే బాగుండు అనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలిపితే, మరి

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (16:22 IST)
హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఓ సందర్భం గురించి ప్రస్తావిస్తూ తోడుంటే బాగుండు అనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలిపితే, మరికొందరు మాత్రం రేణూదేశాయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
మీరు మళ్లీ చేసుకుంటే చచ్చినంత ఒట్టు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌పై మాత్రమే తాను స్పందించానని, కానీ మీడియా మాత్రం పవన్ ఫ్యాన్ అని ప్రచారం చేస్తోందని రేణూదేశాయ్ మళ్లీ ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్‌లో ఎక్కడా పవన్ ఫ్యాన్ అని రాయలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.
 
తాను చాలా స్పష్టంగా ఈ పోస్ట్ తన వ్యక్తిగతానికి సంబంధించినది కాదని చెప్పానని ఆమె వివరించారు. ఈ దేశ పౌరురాలిగా సామాజిక సమస్యపై తన ఆలోచనను పంచుకున్నానని వివరణ ఇచ్చారు. మహిళల స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యానికి సంబంధించి లోతైన చర్చ జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉంటారని.. ఈ చర్చ తన కోసం కాకుండా వాళ్ల కోసం చేయాలని రేణూ దేశాయ్ సూచించారు. వారికి చదువు, ఉద్యోగంపై పూర్తి స్థాయిలో భరోసా కల్పించాలన్నారు. మీడియా చానల్స్ కూడా వివాదాన్ని సృష్టించి.. దాన్ని తప్పుదోవ పట్టించడం మానేసి, విషయంపై సానుకూల ధోరణిలో చర్చ జరిగేలా ప్రసారం చేయాలంటూ ఆమె కోరారు. ప్రతీ ఒక్కరూ తమ కుటుంబంలో ఉన్న మహిళల కోసం కదిలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments