Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ, శ్రీలీల నటిస్తున్న VD 12 రెగ్యులర్ షూటింగ్ మొదలు

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (17:21 IST)
VD12
విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.
 
అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.  తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయిక గా ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరైన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
 
ఇక ఈ చిత్రానికి సంబందించి విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో గన్ పట్టుకొని విజయ్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments