Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అ" రెజీనానే... స్టైలిష్ లుక్‌తో ఇరగదీసింది...

"అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్న చందంగా ఉంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా పరిస్థితి. ఈమె ఎంతో అందచందంగా ఉన్నప్పటీకీ అనుకున్నంత క్రేజ్‌ను సొంతం చేసుకోలేక పోతోంది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (10:55 IST)
"అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్న చందంగా ఉంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా పరిస్థితి. ఈమె ఎంతో అందచందంగా ఉన్నప్పటీకీ అనుకున్నంత క్రేజ్‌ను సొంతం చేసుకోలేక పోతోంది. పైపెచ్చు.. తనకు వచ్చే సినీ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎంతో కష్టపడుతోంది. అయినప్పటికీ ఈ అమ్మడుకి అదృష్టం ఆమడదూరంలో ఉంది.
 
రెజీనా నటిస్తున్న పలు చిత్రాలు పరాజయం పాలవుతున్నాయి. ఇది ఆమెకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సినిమాల్లో తన నటనతో పాటు గ్లామర్‌షోతో అలరిస్తున్నా ఆమెకు హిట్ మాత్రం దక్కడం లేదు. ఇక  రెజీనా "అ" సినిమాలో నటిస్తోంది. నాని ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ కొత్త గెటప్‌లో సిద్ధమైంది. ఈ లుక్‌కు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు. 
 
గోడపై చేతులు పెట్టిన రెజీనా స్టైలిష్ లుక్‌తో అదరగొట్టింది. కుడి చేతిపై ఒక పాములాంటి టాటూను వేసుకొని హెయిర్ స్టైల్‌ను చాలా కొత్తగా చూపించింది. అంతేకాకుండా తన అందమైన వీపుపై ఒక ఆర్ట్ ఉండడంతో అమ్మడు ఏదో ప్రయోగమే చేయబోతోందని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాలో రెజీనాతో పాటు కాజల్, నిత్యామీనన్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. మొన్నటివరకు గ్లామర్ అందాలతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఆకట్టుకోవాలని చూస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments