Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో వ్యభిచార దందాతో నాకు లింకుందా? రెజీనా స్పందన

ఇటీవల తెలుగు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన చికాగో వ్యభిచార దందాపై హీరోయిన్ రెజీనా కూడా స్పందించింది. ఈ దందాపై ఇన్నాళ్ళూ పెదవి విప్పక పోవడానికి కారణాలను కూడా ఆమె తాజాగా వివరించింది. ముఖ్యంగా, కొన్నిసార్

Webdunia
సోమవారం, 9 జులై 2018 (13:03 IST)
ఇటీవల తెలుగు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన చికాగో వ్యభిచార దందాపై హీరోయిన్ రెజీనా కూడా స్పందించింది. ఈ దందాపై ఇన్నాళ్ళూ పెదవి విప్పక పోవడానికి కారణాలను కూడా ఆమె తాజాగా వివరించింది. ముఖ్యంగా, కొన్నిసార్లు వదంతులపై స్పందించకపోవడమే మంచి స్పందన అన్నారామె.
 
ఇటీవల అమెరికాలోని చికాగోలో వ్యభిచార దందా వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఇందులో పలువురు హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్లతో వ్యభిచార దందా నిర్వహిస్తూ వచ్చిన నిర్వాహకులైన భార్యాభర్తలను కూడా యూఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ స్కామ్‌లో హీరోయిన్ రెజీనాకు కూడా సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఎక్కడా స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వ్యభిచార దందాతో పాటు.. క్యాస్టింగ్ కౌచ్‌లపై స్పందిస్తూ, 'కొన్నిసార్లు కొన్నింటికి స్పందించకపోవడమే గొప్ప స్పందన అని నా అభిప్రాయం. నా మీద ఉన్న ఆరోపణల్లో నిజంగా నిజం ఉంటే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం కనిపించి ఉండేది. అందులో ఏమీ లేదు. అలాంటప్పుడు పబ్లిసిటీ కోసం ఎందుకు నేను రియాక్ట్‌ కావాలి? ఒకవేళ నేను రియాక్ట్‌ అయినా, దాని మీద మళ్లీ ఇంకెవరో రియాక్ట్‌ అవుతారు. 
 
వీటన్నింటి వల్ల పరిష్కారాలు ఉండవు కదా. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి? ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి విషయాల్లో మీడియా వాళ్లు కాస్త చూసుకుని మాట్లాడాలి. అది నేను వాళ్లకు చేస్తున్న రిక్వెస్ట్‌. ఒక జర్నలిస్ట్‌ ఏదైనా చెప్తే, కొందరు నమ్ముతారు. అలాంటప్పుడు జర్నలిస్ట్‌లు మాట్లాడటానికి ముందు నిజం తెలుసుకుని, బాధ్యతగా భావించి మాట్లాడాలి' అంటూ విజ్ఞప్తి చేశారు. 
 
పైగా, మనం చేస్తున్న పనిలో నిజాయతీ ఉన్నప్పుడు ఇంక ఏ విషయం గురించీ ఆలోచించక్కర్లేదు. సినిమా పరిశ్రమ చెడ్డది కాదు. అన్ని పరిశ్రమల్లోనూ సమస్యలుంటాయి. కార్పొరేట్‌ రంగం అందుకు అతీతం కాదు. కాకపోతే మేం కెమెరా ముందు ఉన్నాం కాబట్టి అందరూ మమ్మల్ని టార్గెట్‌ చేస్తారు. అలాంటివాటికి స్పందించినప్పుడు సమస్యలు మరింత పెద్ద వార్తలవుతాయి అని రెజీనా చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments