రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం బ్రేకింగ్ న్యూస్ . సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల బ్రేకింగ్ న్యూస్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోమవారం నుంచిప్రారంభమైన షూటింగ్ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను చేస్తున్నాం. వైవిధ్యమైన కథనంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.