Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ముస్లిం టోపీని ఎందుకు ధరించారు : క్లారిఫై చేసిన విజయేంద్ర

Webdunia
గురువారం, 22 జులై 2021 (11:04 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఒక సందర్భంగా చెర్రీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అలాగే, ఎన్టీఆర్ కూడా ముస్లిం టోపీ ధరిస్తారు. ఈ టోపీ ధారణపై చరిత్రకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శకులుసైతం నోరెళ్లబెట్టారు.
 
వీటిపై ఈ చిత్రానికి కథను సమకూర్చిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కొమరం భీమ్ టోపీ పెట్టుకోవడానికి గల కారణాన్ని వివరించారు. భీమ్‌ను పట్టుకోవడానికి నిజాం ప్రభువులు యత్నించారని, ఆయనను వెంటాడారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీమ్ ముస్లిం యువకుడిగా మారాడని, ముస్లిం టోపీ ధరించాడని చెప్పారు. 
 
ఇకపోతే, సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్‌ను పోలీసు పాత్రలో చూపించడానికి కూడా ఒక కారణం ఉందన్నారు. సిల్వర్ స్క్రీన్‌పై అది ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే 'ఆర్ఆర్ఆర్' కథను సిద్ధం చేశామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments