Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పెద్ద చేపను తేలికగా వదులుతారా... నేడు సిట్‌ ముందుకు హీరో రవితేజ

ఇప్పటిదాకా మాదకద్రవ్యాల పంపిణీ, వినియోగం కేసులో సిట్ విచారణ ఎదుర్కున్న వారంతా ఒకెత్తయితే, శుక్రవారం సిట్‌ ముందు విచారణకు రానున్న ప్రముఖ హీరో రవితేజ వ్యవహారం మరో ఎత్తు కాబోతోంది. ఇప్పటిదాకా సినీ దర్శకులు, పలువురు చిన్న హీరోలను ప్రశ్నించిన సిట్, ప్రముఖ

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (07:04 IST)
ఇప్పటిదాకా మాదకద్రవ్యాల పంపిణీ, వినియోగం కేసులో సిట్ విచారణ ఎదుర్కున్న వారంతా ఒకెత్తయితే, శుక్రవారం సిట్‌ ముందు విచారణకు రానున్న ప్రముఖ హీరో రవితేజ వ్యవహారం మరో ఎత్తు కాబోతోంది. ఇప్పటిదాకా సినీ దర్శకులు, పలువురు చిన్న హీరోలను ప్రశ్నించిన సిట్, ప్రముఖ హీరో, ఇండస్ట్రీలో టాప్‌ హీరోల సరసన ఉన్న రవితేజను ప్రశ్నించనుంది. రవితేజ నిజంగా డ్రగ్స్‌ తీసుకున్నాడా, తీసుకుని ఉంటే ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రవితేజ సోదరుడు భరత్‌ గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టవడం తెలిసిందే. రవితేజకు అప్పటి నుంచే డ్రగ్స్‌ లింకున్నాయా అన్న కోణంలోనూ సిట్‌ ప్రశ్నించవచ్చని సమాచారం. 
 
కెల్విన్‌ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్‌ శ్రీనివాసరాజుకు కూడా తాను డ్రగ్స్‌ సరఫరా చేశానని ఈ కేసులో అరెస్టయిన జీశాన్‌ ఇప్పటికే సిట్‌కు తెలిపాడు. రవితేజతో తనకు ఎనిమిదేళ్లకు పైగా పరిచయముందని కూడా సిట్‌కు జీశాన్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజ మధ్య ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తేవడంపై సిట్‌ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. పూరి, రవితేజ కాంబినేషన్‌లో పలు హిట్‌ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
 
రవితేజ విచారణతో సిట్ దర్యాప్తు ఒక వలయం పూర్తవుతుందని భావిస్తున్నారు. తదుపరి చర్యలు ఏంటి, అనుమానం ప్రబలంగా ఉన్న వారిని అరెస్టు చేస్తారా, తొలి వంతు ఎవరది అనేది సస్పెన్స్‌గానే ఉంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments