Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని 'క్రాక్' మూవీ లాస్ట్ షెడ్యూల్‌

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (18:49 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా 'క్రాక్‌'. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్త‌యిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలింది.
 
గోవాలో శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 4) చివ‌రి షెడ్యూల్ మొద‌ల‌వ‌నున్న‌ది. ఇందులో ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌ల‌పై చివ‌రి పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూరుస్తున్న ఈ పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వ‌నున్న‌ది.
 
తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాల‌తో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా త‌యార‌వుతోంది. ఇటీవ‌ల ర‌వితేజ‌, అప్స‌రా రాణిపై చిత్రీక‌రించి, విడుద‌ల చేసిన‌ "భూమ్ బ‌ద్ద‌ల్" అనే స్పెష‌ల్ సాంగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది.
 
స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 'క్రాక్' మూవీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
 
తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి
 
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:  బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె. విష్ణు
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌:  రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు:  రామ‌జోగ‌య్య శాస్త్రి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments