Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్తేరు వీరయ్య నుండి రవితేజ ఫస్ట్ లుక్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:57 IST)
Ravi Teja First Look
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి భారీ అంచనాలు వున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమౌతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై బజ్ పెంచాయి.
 
ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ గురించి అప్‌ డేట్ వచ్చింది. రవితేజ ఫస్ట్ లుక్‌ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేయడానికి మేకర్స్ పవర్-ప్యాక్డ్ ప్రీ-లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. "మాస్ ఈజ్ కమింగ్" అని పోస్టర్ పై రాసుంది. రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది.
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్‌ లో లీడ్‌ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments