Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చచ్చినా పులుపు చావలేదు.. చుక్కల్లో రవితేజ రెమ్యునరేషన్

'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్నది ఓ నానుడి. దీన్ని రుజువు చేసేలా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నడుచుకుంటున్నారట.

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (16:16 IST)
'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్నది ఓ నానుడి. దీన్ని రుజువు చేసేలా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నడుచుకుంటున్నారట. ముఖ్యంగా సినీ అవకాశాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ... రెమ్యునరేషన్ విషయంలో విషయంలో ఈ మాస్ మహారాజా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. దీంతో దర్శకనిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట. 
 
రెండేళ్ల గ్యాప్‌తో రవితేజ చేసిన "రాజా ది గ్రేట్" హిట్ టాక్ సొంతం చేసుకోగా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు బ్రేక్ ఈవెన్ రాలేదని అంటున్నారు. అయితే ఓవరాల్‌గా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. "బెంగాల్ టైగర్" తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా మాస్ రాజా క్రేజ్ మరింత పెంచేసింది. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచాడట. తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు రూ.10 కోట్లు ఇస్తేనే సినిమా అంటున్నాడట రవితేజ.
 
రవితేజకు అన్ని కోట్లు అంటే సినిమా బడ్జెట్ ఎంతలేదన్నా రూ.30 కోట్లకు చేరుకుంటుంది. ఆ చిత్రానికి హిట్ టాక్ వస్తేనే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. లేదంటే నిర్మాతతో పాటు పంపిణీదారులు కూడా నష్టాలను చవిచూడాల్సిందే. కానీ, తన రెమ్యునరేషన్ విషయంలో రవితేజ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. అందుకే పలు ఆఫర్లను కూడా కోల్పోతున్నాడట. మొత్తానికి రవితేజ రెమ్యునరేషన్ షాక్‌తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments