#KGFChapter2 రవీనా టాండన్ ఎంట్రీ.. ట్రిపుల్ ఆర్‌తో పోటీపడుతుందా?

Webdunia
ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (17:15 IST)
KGF2
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వచ్చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండో భాగాన్ని ఛాప్టర్‌ 2గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ యష్‌నే హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
తాజాగా మరో బాలీవుడ్ సీనియర్ కథానాయిక రవీనా టాండన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. గతంలో రవీనా కన్నడ చిత్రం ఉపేంద్రలో ఉపేంద్రతో కలిసి నటించింది. కన్నడలో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నటిస్తుంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. 
 
ఇటీవల రవీనాను కలిసిన ప్రశాంత్ నీల్ ఆమెను ఒక పాత్ర కోసం సంప్రదించారట. కేజీఎఫ్ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా వెంటనే నటించేందుకు ఒప్పేసుకుందట. ఇకపోతే.. కేజీఎఫ్ 2 చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఖాళీ చేసిన జులై 30 - 2020వ తేదీన వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో కేజీఎఫ్ 2 చిత్రం స్టార్ కాస్ట్ విషయంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుందని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments