Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతితో ఒక్క మెడల్ కొట్టేస్తా: లంచగొడి ఎస్ఐ పాత్రలో రాశిఖన్నా

తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ సినిమాలోనే ప్రతినాయకుడిగా అడుగుపెడుతుండగా నాకేం తక్కువ అంటూ అందాల తార రాశిఖన్నా కూడా అదే సినిమాలో విలన్ పాత్రలోకి దిగిపోయిందని సమాచారం.

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (05:53 IST)
జగపతి బాబు లెజెండ్ సినిమాలో ఏ ముహూర్తంలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టాడో కానీ బాలీవుడు, కొలివుడ్, మల్లువుడ్ అనే తేడా లేకుండా విలన్ పాత్రలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది.  రజనీకాంత్ 2.0 సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రకు ఒప్పుకుని సంచలనం సాధించగా, ఇప్పుడు కొలివుడ్ కూడా విలనీ పాత్రలకోసం పరుగులెడుతోంది. హీరోలే కాదు. హీరోయిన్‌లు కూడా విలనీలుగా నటించడానికి మహా ఇదిగా ముందుకొచ్చేస్తున్నారు.
 
తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ సినిమాలోనే ప్రతినాయకుడిగా అడుగుపెడుతుండగా నాకేం తక్కువ అంటూ అందాల తార రాశిఖన్నా కూడా అదే సినిమాలో విలన్ పాత్రలోకి దిగిపోయిందని సమాచారం. మోహన్‌లాల్ కథానాయకుడిగా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తీయనున్న విలన్ సినిమాలా విశాల్ ప్రతినాయకుడిగా ప్రధాన పాత్రలో నటిస్తుంటే, బొద్దు సుందరి రాశీఖన్నా ఒక అవినీతి పోలీసు అధికారిణిగా కన్పించబోతోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని ఎర్నాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకొంటోంది. భారత్‌లోనే తొలిసారి 8కే రిజల్యూషన్‌ ఫార్మాట్‌లో రూపొందుతోంది. మలయాళంలో భారీ బడ్జెట్‌ చిత్రంగానూ రికార్డు సృష్టిస్తోంది. విశాల్‌, రాశీఖన్నాతో పాటు హన్సిక, శ్రీకాంత్‌, మంజువారియర్‌ లాంటి స్టార్స్‌ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మించడం మరీ విశేషం.
 
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments