Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మనసులో అతడే ఉన్నాడు.. పెళ్లి కూడా అతడితోనే: రష్మిక

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (14:23 IST)
దక్షిణాది, బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరు రష్మిక... సినీ కెరీర్ పరంగా దూసుకెళ్తోన్న ఈ చిన్నది తాజాగా పెళ్లి గురించి మాట్లాడారు. తన మది దోచిన చిన్నవాడి పేరు బయటపెట్టారు. అతడికి కూడా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్నట్లు చెప్పారు. ఇంతకీ ఆమె మనసులో ఉన్న వ్యక్తి ఎవరంటే..?
 
బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటి రష్మిక ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కెరీర్‌, అభిమానుల గురించి ఆమె సరదాగా మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘మేడమ్‌.. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? మీ వివాహం ఎప్పుడు?’ అని ప్రశ్నించారు. 
 
దీనిపై స్పందించిన ఆమె.. 'నాకు ఎప్పుడో నరుటోతో పెళ్లైపోయింది. అతడే నా మనసులో ఉన్నాడు' అని ఆమె బదులిచ్చింది. రష్మిక సమాధానాన్ని విన్న టైగర్‌ మొదట షాక్‌ అయ్యారు. అసలు విషయం అర్థం చేసుకుని చిరునవ్వులు చిందించారు.
 
ఇంతకీ అతను ఎవరంటే.. జపానీస్‌ వెబ్‌ సిరీస్‌ ‘నరుటో’లో ప్రధాన పాత్ర. అతడి పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. రష్మిక కూడా ఆ పాత్రకు వీరాభిమాని. ‘నరుటో’ను తాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ఇన్‌స్టా వేదికగా పోస్టులు పెట్టారు. 
 
అవకాశం వస్తే సిరీస్‌లో నరుటో ప్రేయసిగా కనిపించే హినాటగా తాను ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆమె వలే హెయిర్‌ స్టైల్‌ చేయించుకోవాలని ఉందన్నారు. ఇక రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘యానిమల్‌’, ‘రెయిన్‌ బో’ చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments