గీతగోవిందం హిట్టయ్యాక రష్మిక మందనకు మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో డియర్ కామ్రేడ్‌లో నటిస్తున్న ఆమె, నితిన్ జోడీగా 'భీష్మ' చేయనుంది. తెలుగులోనే మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో వుంది. అంతేగాకుండా కోలీవుడ్‌లోనూ ఛాన్సులు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
తమిళంలో ఊపిరి ఫేమ్ కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి 'రెమో' దర్శకుడు సన్నాహాలు మొదలెట్టేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆయన రష్మికను తీసుకునే అవకాశం వున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.