Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం రష్మిక మందన్నా.. మరింత క్లియర్‌గా డీప్‌ఫేక్ వీడియోను సృష్టించిన నేరగాళ్లు..

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (11:36 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నా మరోమారు డీప్‌ఫేక్ బారినపడ్డారు. మరింత స్పష్టంగా కనిపించేలా ఆమె డీప్ ఫేక్ వీడియోను కొందరు దండగులు సృష్టించారు. ఈ వీడియోలో ఆమె అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు షాక్ తిన్నారు. ఈ వీడియోను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు.

అయితే, ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ  వీడియోలో ఓ యువతి అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖాన్ని జతచేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు, రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, అల్లు అర్జున్‌తో చేసిన‌ 'పుష్ప' మూవీతో ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కింది. ఆ త‌ర్వాత ఇటీవ‌లే ర‌ష్మిక మందన్న‌ బాలీవుడ్ మూవీ 'యానిమ‌ల్‌'తో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకెళ్తున్న ఆమెకు డీప్‌ఫేక్ వీడియోలు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప‌-2', 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌', 'రెయిన్ బో' వంటి చిత్రాల‌తో బిజీగా ఉంది.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments