Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందన్న బంపర్ ఆఫర్ వద్దనుకుందా? (video)

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:21 IST)
టాలీవుడ్ స్టార్ రష్మిక మందన్న బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అయితే రష్మికకు బాలీవుడ్‌లో ఓ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చినా.. ఎందుకో అంగీకరించలేదు. 
 
గతేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. రీసెంట్‌గా అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ మంచి సక్సెస్ అందుకున్నాడు. 
 
అదే ఊపులో తెలుగులో హిట్టైయిన 'జెర్సీ' హిందీ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పాడు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 
 
ఇక హిందీలో షాహిద్ కపూర్ సరసన రష్మిక మందన్నను ఎంపిక చేశారు. కానీ రష్మిక మందన్న ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా హిందీ రీమేక్ నుంచి తప్పుకుంది. మరి రష్మిక నో చెప్పిన పాత్రలో ఇంకెవ్వరు నటిస్తారో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అత్యవసర పరిస్థితి ఉంటే జగన్ ఇలా తిరుగుతుంటాడా?... పైలట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments