Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక - రక్షిత్ లవ్ బాండ్ చాలా బలమైనది...

రష్మిక మందన్న... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "గీతగోవిందం" చిత్రంలో హీరోయిన్. ఈమె ఓ కన్నడ చిత్రంలో నటించింది. ఈ చిత్ర నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలోపడి పెళ్లి చేసుకోవాలని నిర్శితార్థం కూడా

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (11:14 IST)
రష్మిక మందన్న... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "గీతగోవిందం" చిత్రంలో హీరోయిన్. ఈమె ఓ కన్నడ చిత్రంలో నటించింది. ఈ చిత్ర నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలోపడి పెళ్లి చేసుకోవాలని నిర్శితార్థం కూడా చేసుకుంది. అయితే, 'గీతగోవిందం' చిత్రం తర్వాత రష్మికకు సినీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఆమె తన సినీ కెరీర్‌పై దృష్టిసారించినట్టు సమాచారం.
 
పైగా, 'గీతగోవిందం' చిత్రంలో విజయ్ దేవరకొండతో ఆమె మరింత సన్నిహితంగా ఉండటాన్ని ఆమె ప్రియుడు జీర్ణించుకోలేక పోతున్నాడనే వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరి మధ్య బ్రేకప్ ఏర్పడినట్టు వార్తలు షికార్లు చేశాయి. పైగా, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని సినీ కెరీర్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ విషయంపై తాజాగా రష్మిక మందన పీఆర్వో స్పందించారు. 'రష్మిక .. రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లిద్దరి మధ్య లవ్ బాండ్ చాలా బలమైనది. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇద్దరూ ఎప్పటిలానే కలిసి ఫంక్షన్స్‌కి వెళుతున్నారు. వాళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ రద్దయిందనే వార్తలను నమ్మొద్దు' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments