Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతినిండా సినిమాలతో రష్మిక మందన్నా

Webdunia
శనివారం, 25 మే 2019 (11:48 IST)
"ఛలో, గీత గోవిందం" సినిమాలు హిట్ కావడంతో రష్మిక మందన్నా కెరీర్ బిజీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక చేతి నిండుగా సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక తమిళ హీరో కార్తీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
సినీ వర్గాల సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త దర్శకుడు లోకేష్ కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే రష్మిక కానీ, విజయ్ కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. 
 
మరోవైపు విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా రష్మిక మరి కొందరు అగ్ర హీరోలతో స్క్రీన్ పంచుకునే ఛాన్స్ కొట్టేసినట్లు కూడా సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments