Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప -2 ద రూల్‌లో ప‌వ‌ర్‌ఫుల్ శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక మంద‌న్న

డీవీ
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (15:46 IST)
Rashmika Mandanna
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.

అయితే పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీ‌వ‌ల్లిగా న‌టించి త‌న న‌ట‌న‌తో అంద‌ర్ని అల‌రించి నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయిన ర‌ష్మిక మంద‌న్న పాత్ర పుష్ప‌-2 ది రూల్‌లో త‌న‌దైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకోబోతుంది. ఈ రోజు ర‌ష్మిక మంద‌న్న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుష్ప -2లో ఆమె పాత్ర గెట‌ప్‌ను రివీల్ చేస్తూ ఓ స్ట‌నింగ్ పోస్ట‌ర్‌ను వ‌దిలారు మేక‌ర్స్‌.

ఈ పోస్ట‌ర్ చూసిన వాళ్లంతా ర‌ష్మిక ఈ చిత్రంలో  ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌బోతుంద‌ని అంటున్నారు.  ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా  ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం  ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.
 
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
 టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి,  నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే, లిరిసిస్ట్: చంద్రబోస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా 10 రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే.. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే...

డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... జన్మతః పౌరసత్వం చట్టం

Tulasi Reddy: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. నవ్వు తెప్పిస్తుంది.. తులసి రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనపని మొదలెట్టిన డోనాల్డ్ ట్రంప్!!

అధ్యక్ష భవనాన్ని మాత్రమే వీడాను... పోరాటాన్ని కాదు.. జో బైడెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments