Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్ ఆనంద్.. నీవ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా ఇరికిస్తే ఎలా? రష్మిక

ఠాగూర్
మంగళవారం, 28 మే 2024 (08:46 IST)
హీరోయిన్ రష్మిక మందన్నా, యువ హీరో ఆనంద్ దేవరకొండల మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. "గం గం గణేశా" చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, సారికలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా, ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోయిన్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రష్మికకు - ఆనంద్ దేవరకొండగు మధ్య సరదా సంభాషణ జరిగింది. అదేంటో చూద్దాం. 
 
ఆనంద్ : మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్? 
రష్మిక : వియత్నాం 
 
ఆనంద్ : మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరేట్? 
రష్మిక : రేయ్ ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీరా. నన్ను ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్ (విజయ దేవరకొండ) అని బదులిచ్చారు. 
 
ఆనంద్ : మా చిత్రంలో గణేశుడిది కీలక పాత్ర ఆయన గురించి మేరేం చెబుతారు. 
రష్మిక : నేను దేవుడిని బలంగా నమ్ముతా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. వినాయక చవితి నాకు ఎపుడూ ప్రత్యేకమే. 
 
ఆనంద్ : మీ ఫ్రెండ్స్‌లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు? 
రష్మిక : నేనే.. నీ ఫోటో కూడా తీశా. కానీ ఎవరూ క్రెడిట్ ఇవ్వలేదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments