Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే రేష్మి “తను వచ్చెనంట”.. ఈనెల 21న రిలీజ్

శ్రీ అచ్యుత ఆర్ట్స్ బేనర్‌పై, రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఆజాద్, నిర్మిస్తున్న టాలీవుడ్ మొట్టమొదటి జోంబీ కామెడీ చిత్రం “తను వచ్చెనంట” నిర్మాణానంతర కార్యక్రమాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ద

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (17:09 IST)
శ్రీ అచ్యుత ఆర్ట్స్ బేనర్‌పై, రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఆజాద్, నిర్మిస్తున్న టాలీవుడ్ మొట్టమొదటి జోంబీ కామెడీ చిత్రం “తను వచ్చెనంట” నిర్మాణానంతర కార్యక్రమాలు, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు దిగ్విజయంగా ముగించుకుని సెన్సార్ పూర్తి చేసుకుంది.. అక్టోబర్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 
 
ఈ చిత్ర నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, ఇటీవల తమ చత్ర యూనిట్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, రావులపాలెం మొదలగు ప్రాంతాలలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, తప్పక "తను వచ్చెనట" చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్‌తో సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. 
 
తమ చిత్ర యూనిట్ 100 శాతం అంకితభావంతో చేసిన కృషికి అక్టోబర్ 21వ తేదీన థియేటర్స్‌లో ప్రేక్షకులు తీర్పు పాజిటివ్ తీర్పునే ఇవ్వబోతున్నారని, ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారని నిర్మాత చెప్పారు.
 
నిర్మాత మాట్లాడుతూ భీమవరం ప్రమోషన్‌కి వెళ్ళినప్పుడు మా చిత్రం ట్రైలర్ చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త మంతెన రవి రాజు ఈస్ట్, వెస్ట్ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫాన్సీ రేట్‌కు తీసేసుకున్నారు. మాకు ఆనందం కలిగింది. అదేవిధంగా వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సూర్య ఫిలిమ్స్ డి.ఎస్.పి.టి.వర్మ, ఎన్.రాజేష్ వర్మ తీసుకోవటం ఇంకా ఆనందం కలిగింది'' అన్నారు. 
 
కొత్త తరహా కథాంశంతో అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రొటీన్ సినిమాలా కాకుండా, కథ, కథనం చాల ఫ్రెష్‌గా ఉంటుందని, సగటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు కలిగివుండి, అటు క్లాసు‌ని, ఇటు మాస్‌ని కూడా మెప్పిస్తుందని దర్శకుడు వెంకట్ కాచర్ల చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments