Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు హానికరమంటున్న నాగ చైతన్య... అబ్బాయిలు విషపూరితమంటున్న రకుల్.. ఎందుకు? (Trailer)

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద

Webdunia
గురువారం, 25 మే 2017 (14:53 IST)
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద కామెంట్స్ టాలీవుడ్‌లో రచ్చరచ్చగా మారిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలలో మాత్రం హీరో నాగ చైతన్య ఓ డైలాగ్ చెపుతూ ఇందులో నీతి ఏంటంటే.. మనశ్శాంతికి అమ్మాయిలు హానికరమంటూ పలుకుతాడు. ఈ చిత్రంలో హీరో మాత్రం ఇలాంటి డైలాగ్ చెపుతుంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం మరోలా సెలవిస్తున్నారు. 
 
చలపతిరావు వివాదం తర్వాత ఆమె స్పందిస్తూ ఈ సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌పై స్పందించింది. త‌న‌ను ఎవరైనా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని అడిగితే అబ్బాయిలు పాయిజనెస్‌ అని చెబుతానని స‌ర‌దాగా చెప్పింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.
 
ఇప్పటివరకు తాను ఏ సినిమాలోనూ క‌నిపించన‌టువంటి పాత్రంలో ఈ సినిమాలో క‌న‌ప‌డుతున్నాన‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ సినిమాలో త‌న పాత్రకి ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని చెప్పింది. తాను తెలుగు నేర్చుకుంటానని, తెలుగు సినిమాల వ‌ల్లే తాను ఎంతో గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఓ ఇన్నోసెంట్‌ లవ్‌స్టోరీని చూస్తార‌ని చెప్పింది.
 
అలాగే హీరో చైతూ మాట్లాడుతూ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేస్తున్నప్పుడు తాను మొదట భయపడ్డానని, ఎందుకంటే, ఈ తరహా చిత్రంలో నటించడం తనకు ఇదే మొదటి సారి అని, ఇప్పుడు ఆ భయం పోయిందని ప్రముఖ నటుడు నాగ చైతన్య అన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నాడు. భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని, ఏ హీరోయిన్ రకుల్ పాత్రను అంత అద్భుతంగా పోషించలేదని కితాబు ఇచ్చాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments